SSC ADVANCED SUPPLEMENTARY TIME TABLE

SSC SUPPLEMENTARY TIME TABLE




అమరావతి: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,14,281 మంది పాసయ్యారని మంత్రి వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో.. అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు బొత్స చెప్పారు. ఫలితాలకు సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు.


‘‘ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు జరిగాయి. మే 13-22 మధ్య స్పాట్‌ వాల్యుయేషన్‌ చేశాం. పరీక్షలకు మొత్తం 6,15,908 మంది విద్యార్థులు హాజరుకాగా 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలే పైచేయి సాధించారు. 2,02,821 మంది బాలురు, 2,11,460 మంది బాలికలు పాసయ్యారు. మొత్తం 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురులో 64.02 శాతం, బాలికల్లో 70.70 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 78.30శాతంతో ప్రథమ స్థానంలో.. అనంతపురం జిల్లా 49.70శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,671 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా.. వీటిలో 797 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది’’ అని మంత్రి బొత్స వివరించారు. 


రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటించారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments