Happy Ugadi 2022: ఉగాది నాడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు



Ugadi 2022: తెలుగు వారి అతి ముఖ్యమైన పండుగ ఉగాది. ముఖ్యంగా ఈ పండుగ నుంచి అంతా మంచే జరగాలని అంతా కోరుకుంటారు. తెలుగు సంవత్సరాది ప్రారంభం హ్యాపీగా ఉంటే..

ఆ ఏడాది అంతా చాలా సంతోషంగా ఉంటుందన్ని నమ్ముతుంటారు. వసంత రుతువు ప్రారంభమవ్వగానే ప్రతి ఒక్కరిలో నవ చైతన్యం వస్తుంది. 


ఉగాదిలో 'ఉగ' అంటే నక్షత్రపు నడక అని.. నక్షత్రాలనడక ప్రారంభం అంటే.. ఈ సృష్టి ప్రారంభ నుంచి యొక్క 'ఆది' ఉగాది అయ్యిందని పండితులు చెప్పే మాట. 


ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. మరి కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు.


ఇంతకీ తెలుగు వారి కొత్త ఏడాదిలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే విషయాలు తెలుసుకుందా. ముఖ్యంగా ఉగాది పండుగ ఈరోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. 


మన శరీరానికి, తలకు నువ్వులనూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని తలంటు పోసుకోవాలి. తరువాత ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన తరువాత సూర్య నమస్కారం చేయాలి.


ఉగాది రోజును చేయాల్సిన పనులు..


ఉగాది పండుగ రోజున కచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలని పెద్దలు చెప్పిన మాట. అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు. 


ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల మీకు ఎండ, గాలి, వర్షం నుండి రక్షణ లభిస్తుంది. ఇక వేసవికాలంలో ఒకప్పుడు విసనకర్రల అవసరం బాగా ఉండేది. 


వాటిని వెదురు బొంగులతో, తాటాకులతో చేసేవారు. వాటితో విసురుకోవడం వల్ల సమ్మగా ఉండేది. మన బాడీ హాయిగా ఉండేది. అయితే ఇప్పుడంతా ఫ్యాన్లనే వాడుతున్నారు. 


ఈ సమయంలో మీరు పేదలకు విసినికర్రలు లాంటివి.. దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది.


ఇక ఉగాది రోజున దమనేన పూజ చేయాలి. దమనం అంటే ఒక పత్రి. సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలంలో ఇవి విరివిగా దొరికేవి.


దవనంతో ఉగాది పండుగ రోజు నుండి పౌర్ణమి వరకూ ఒక దేవతా మూర్తిని ఎంతో నియమ నిష్టలతో పూజలు చేయాలి. 


చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు.. విదయ రోజున శివునికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకుడికి, ఇలా పౌర్ణమి వరకు దేవుళ్లకు పూజలు చేయాలి.


ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఉగాది పండుగ రోజున కచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలా మందికి తెలియదు. 


ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ


ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫ్లవ నామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని


మనసారా కోరుకుంటున్నాం.



ఉగాది రోజు చేయకూడని పనులు ఇవే..


ఉగాది పండుగ రోజున ఆలస్యంగా నిద్ర లేవడం ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు. అలాగే మాంసహారం, మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. 


పాత బట్టలు ధరించకూడదు. అన్నింటి కంటే ముఖ్యంగా దక్షిణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించదు.

Post a Comment

0 Comments