AP Polycet 2021: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
ఏపీ పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 (పాలిసెట్) ఫలితాలు వెల్లడయ్యాయి. మంత్రి గౌతమ్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్‌లాల్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్‌కు మొదటిర్యాంకు సాధించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా కల్పిస్తున్నట్లు వివరించారు.
VIEW YOUR RESULTS: CLICK HERE FOR RESULTS
0 Comments
Please do not enter any spam link in the comment box