SSC CGL NOTIFICATION

 SSC CGL Notification 2020: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్ఎస్సీ సీజీఎల్ నోటిఫికేషన్ విడుదల


👉డిగ్రీ అయిపోయి ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్ (సీజీఎల్) (SSC CGL) 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.


👉 ఈ ఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్ష ద్వారా నేరుగా కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వెళ్లే చాన్స్ కూడా ఉంది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేసేందుకు గానూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రంగం సిద్దం చేస్తున్నది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.


👉ఇందులో మొత్తం 6,506 ఖాళీలున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఉన్న ఖాళీలివి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నేటి (డిసెంబర్ 31) నుంచే ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది (2021) జనవరి 31 దాకా దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్  చూడొచ్చు.


👉మొత్తం ఖాళీలు..

గ్రూప్ -బి గెజిటెడ్ - 250

గ్రూప్ -బి నాన్ గెజిటెడ్ - 3,513

గ్రూప్ -సి 2743


👉పోస్టులు : అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ అకౌంట్స్‌ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్, ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఇన్‌క‌మ్ టాక్స్, జూనియ‌ర్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్, ఆడిట‌ర్‌, అకౌంటెంట్‌, సీనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌, టాక్స్ అసిస్టెంట్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ ‌త‌దిత‌ర పోస్టులున్నాయి.


👉అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుత‌న్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. అయితే 01.01.2021 నాటికి సంబంధిత అర్హ‌త పూర్తి చేసి ఉండాలి.


👉వ‌య‌సు: పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.


👉ఎంపిక విధానం: దీనికి ఎంపిక ప్ర‌క్రియ 4 ద‌శ‌ల్లో ఉంటుంది.


టైర్‌-1: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌

టైర్‌-2: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌

టైర్‌-3: పెన్ మరియు పేప‌ర్ ప‌ద్ధ‌తిలో.. (డిస్క్రిప్టివ్ పేప‌ర్‌)

టైర్‌-4: క‌ంప్యూట‌ర్ ప్రోఫిషియ‌న్సీ టెస్ట్‌/ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్‌ ఆధారంగా....


👉ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: డిసెంబర్‌ 29, 2020


👉దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2021


👉ఆన్‌లైన్ పేమెంట్ చెల్లింపున‌కు చివ‌రితేది: ఫిబ్రవరి 02, 2021


👉ఆఫ్‌లైన్ పేమెంట్ (చ‌లాన్ ద్వారా) చెల్లింపున‌కు చివరితేది: ఫిబ్రవరి 04, 2021.


👉టైర్‌-1 ప‌రీక్ష ‌తేది: 29.05.2021 నుంచి 07.06.2021 వ‌ర‌కు.


👉టైర్‌-2 ‌ప‌రీక్ష ‌తేది (డిస్క్రిప్టివ్ పేప‌ర్‌): ఇంకా ప్రకటించలేదు.


👉ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


👉దర‌ఖాస్తు ఫీజు: ఇత‌రుల‌కు రూ.100, ఎస్సీ/ ఎస్టీ/ స‌్త్రీ/ పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.


👉వెబ్‌సైట్‌: https://ssc.nic.in/



Post a Comment

0 Comments