*జాతీయ గణితదినోత్సవం*
*గణిత మును ప్రేమించుమన్నా*
*తర్క మన్నది పెంచుమన్నా*
*గణితమంటే సమస్య కాదోయ్*
*గణితమంటే సాధ నొయ్*
*గణిత ప్రేమికులకు" జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు"*
*20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు మన శ్రీనివాస రామానుజన్.*
*గణిత శాస్త్రములో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు తరువాత భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి మన శ్రీనివాస రామానుజన్.*
*అటువంటి మేధావిని స్మరించుకుని ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం మన బాధ్యత*
*శ్రీనివాస రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా కుంభకోణం దగ్గర ఈరోడ్ లో నిరుపేద బ్రాహ్మణ దంపతులకు 1887 డిసెంబర్ 22న జన్మించారు.*
*ఆయన తండ్రి కుప్పుస్వామి శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. తల్లి గృహిణి.*
*శ్రీనివాస రామానుజన్ 1892 లో కుంభకోణంలోని ఒక వీధిబడిలో ప్రాథమిక విద్యను ప్రారంభించారు*
*ఆయన తన పదవ ఏట ప్రాథమిక విద్యలో ఎంతో తెలివైన వాడి గా పేరు తెచ్చుకున్నారు. ఎటువంటి లెక్కన అయినా చిటికెలో చేసే రామానుజన్ పెద్ద సంఖ్యలో ని గుణకార ,బాగా హారాలను మెదడులోని చేసి ఉపాధ్యాయులను అబ్బురపరిచే వారు.*
*రామానుజన్ తన పదమూడవ యేట"" LONI""రాసిన త్రికోణమితి గ్రంధాన్ని గ్రంథాలయము నుండి తీసుకొని దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు*
*ఆ తర్వాత KAAR రచించిన మ్యాథమెటిక్స్ బుక్కును చదివి సిద్ధాంతాలను ,సూత్రాలను అభివృద్ధి చేయటం మొదలుపెట్టారు.*
*ఆయన తన 16వ ఏట మెట్రిక్యులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.*
*1909వ సంవత్సరంలో janakiammal తో వివాహం అయినది.*
*ఈయన రాసిన వ్యాసాలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ G.H.Hardy కు బాగా నచ్చి శ్రీనివాస్ రామానుజన్ ను ఇంగ్లాండ్ రమ్మని ఆహ్వానించాడు*
*అయితే ఇంగ్లాండ్ వెళ్లి గణిత పరిశోధనలతో తిండి ,నిద్ర లేక, విపరీతమైన చలి వలన ఆయన ఆరోగ్యం క్షీణించింది.*
*ఆయన ప్రతిభను గుర్తించి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆయనకు 1916లో బిఏ పట్టాను ప్రధానం చేసి గౌరవించింది.*
*1918 వ సంవత్సరంలో రామానుజన్ కృషిని గుర్తించి లండన్ రాయల్ సొసైటీ సభ్యత్వాన్ని ఇచ్చింది.*
*అదే సంవత్సరం అక్టోబర్లో ట్రినిటీ కాలేజ్ FELLO గా ఎన్నికయ్యారు.*
*ఆ గౌరవం పొందిన మొదటి భారతీయుడు శ్రీనివాస రామానుజన్.*
*రానురాను రామానుజన్ ఆరోగ్యం క్షీణించడం తో 1919 మార్చిలో భారతదేశం తిరిగి వచ్చేశారు. ఆయనకు ప్రత్యేక వైద్య వసతులు కల్పించినా కూడా 1920వ సంవత్సరం ఏప్రిల్ 26 న తుదిశ్వాస విడిచారు*
*1962 సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం పురస్కరించుకొని సంఖ్యా శాస్త్రానికి ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది.*
*2012 సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజు డిసెంబర్ 22 ను జాతీయ గణిత దినోత్సవం గా ప్రకటించారు.*
*ఆయన 125వ జయంతి సందర్భంగా 2014 సంవత్సరాన్ని భారత ప్రభుత్వం జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది*
*Hardy-Ramanjan number 1729*
*1.Smallest natural number*
*2.which can be expressed as Sum of Cubes of two numbers in two different ways*
*1729=1+1728=cube* *of1+cube of 12*
*1729=1000+729*
*=Cube of 10+cube of 9*
*అటువంటి మహనీయుని మరొక్కసారి స్మరించుకుని ఆయన కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు*
Tags: జాతీయ గణితదినోత్సవం , Ramanjan,Hardy-Ramanjan number 1729

0 Comments
Please do not enter any spam link in the comment box